Children Drawing Competition in Vijayawada : ఏకాగ్రత, పట్టుదల దానికితోడు సృజనాత్మక జతకలిస్తే అద్భుత చిత్రాలు గీయగలరు చిన్నారులు. మట్టి ముద్దను సైతం ముద్దులోలికే బొమ్మలుగా మలిచే శక్తి ఆ చిట్టిచేతులకు ఉంది. చిన్నారుల్లో ఉన్న ఈ కళను వేలికి తీసేందుకు నిర్వహకులు విజయవాడలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల్లో మూడు జిల్లాల నుంచి వివిధ పాఠశాలకు చెందిన వేలాది విద్యార్థులు పాల్గొన్నారు. వారి చిన్ని చేతులతో ఎన్నో అందమైన బొమ్మలతో పాటు పర్యావరణ హితం కోరే చిత్రాలు సైతం గీశారు.
Be the first to comment