CM Chandrababu on Annadata Sukhibhava Scheme : అన్నదాతా సుఖీభవ పథకాన్ని ఈ నెల నుంచే ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పాఠశాలల ప్రారంభానికి ముందే తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. కడపలో మే 27, 28, 29 తేదీల్లో మహానాడు జరగనున్నందున ఈ నెల 18 నాటికే అన్ని కమిటీలు పూర్తి చేయాలని సూచించారు. మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీలు వేస్తామన్నారు. ప్రధాని చేతుల మీదుగా రాజధాని రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమం విజయవంతమైన వేళ దేశం, ప్రపంచం దృష్టి అమరావతి మీదకు మళ్లిందన్నారు.
Be the first to comment