Aurobindo on 108 and 104 Services : ఆంధ్రప్రదేశ్‌లో 104, 108 సేవల నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో సంస్థ వైదొలిగే సూచనలు కనిపిస్తున్నాయి. సర్వీసుల పనితీరు ఘోరంగా ఉందన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. నిర్వహణ దారుణంగా ఉందని నిఘా సంస్థలు కూడా సర్కార్‌కి నివేదించాయి. ఈ పరిస్థితుల్లో స్వయంగా బాధ్యతల నుంచి తప్పుకోవాలని లేదంటే అధికారాల అనుసారం కఠిన చర్యలు తీసుకుంటామని అరబిందో యాజమాన్యానికి ప్రభుత్వం స్పష్టం చేసింది. బాధ్యతల నుంచి అరబిందో సంస్థ తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుండగా దీనికి తగ్గట్లు టెండర్లు పిలిచేందుకు వైద్యఆరోగ్యశాఖ సిద్ధమైంది.
Be the first to comment