Flood to Krishna River Karakatta: కృష్ణానదికి రికార్డుస్థాయిలో వరదనీరు పోటెత్తింది. సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రకాశం బ్యారేజీ నుంచి 11.45 లక్షల క్యూసెక్కులు నీరు నదిలోకి విడుదల చేశారు. ఊహించని స్థాయిలో వరద రావడంతో కృష్ణానది కరకట్ట ప్రమాదంలో పడింది. టీడీపీ హయాంలో కరకట్ట బలోపేతం, విస్తరణ పనులను సగానికి పైగా పూర్తి చేశారు. మిగతా పనులను తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది. కనీసం నిర్వహణను పట్టించుకోకపోవటంతో చాలచోట్ల కరకట్ట బలహీనపడింది. ఇప్పుడు రికార్డు స్థాయిలో వస్తున్న వరదతో కరకట్ట ఎక్కడ, ఎప్పుడు తెగుతుందోనని జనం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడపాల్సిన దుస్థితి ఏర్పడింది.
Be the first to comment