CM Revanth Review Irrigation Dept : కృష్ణానదిపై అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులన్నింటినీ రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు, ఉదండాపూర్ వరకు తొలి ప్రాధాన్యంగా తీసుకోవాలన్నారు. కృష్ణాజలాల్లో న్యాయబద్ధమైన వాటా కోసం ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయడం సహా రాష్ట్ర ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యంగా గుర్తించాలని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్లోని జలసౌధలో నీటిపారుదల శాఖకి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు. మంత్రులు, సీఎస్, ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో కలిసి నదీజలాలు, అంతర్ రాష్ట్ర అంశాలు, ప్రాధాన్యతా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు.
Be the first to comment