Central Minister Shivraj Singh Chouhan: వరద కారణంగా నష్టపోయిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండగా ఉంటాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ భరోసా ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటనలో ఆయన కృష్ణ జిల్లా కేసరపల్లికి వచ్చారు. బుడమేరు దెబ్బకు నిండా మునిగిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం రైతులను అడిగి పంట నష్ట వివరాలను తెలుసుకున్నారు. రైతులు పరిస్థితి చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన చెందుతున్నారని, ఆయనతో మాట్లాడుతున్న సమయంలో కన్నీటిని గమనించానని తెలిపారు.
Be the first to comment