Balakrishna Inspected TIDCO Houses: గత ప్రభుత్వంలో కోట్ల రూపాయల దోపిడీ యథేచ్ఛగా సాగిందని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అక్రమాలపై నిగ్గు తేలుస్తామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అసంపూర్తిగా నిలిచిపోయిన టిడ్కో గృహాలను ఎంపీ పార్థసారథితో కలిసి ఎమ్మెల్యే బాలకృష్ణ పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను 6 నెలల్లో పూర్తి చేసి, లబ్ధిదారులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు.
Be the first to comment