Krishna Floods in Lanka Villages :చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో కృష్ణానదికి వరద పోటెత్తడంతో నదీ తీర ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రకాశం బ్యారేజీకి 11.4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావడంతో లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. కరకట్ట లోపల గ్రామాలు నీటిలో చిక్కుకోవడంతో అక్కడి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడే ఉన్నవారికి పడవల ద్వారా ఆహారం సరఫరా చేశారు. భారీ వరదతో కరకట్ట బలహీనంగా ఉన్నచోట్ల గండి పడుతుందనే భయం తీర ప్రాంత ప్రజలు, అధికారుల్ని కలవరపెడుతోంది. గతంలో ఎన్నడూ ఇలాంటిది చూడలేదని కరకట్ట పైఅంచు తాకుతూ ఇలా ప్రవహించడం ఇదే తొలిసారని చెబుతున్నారు.
Be the first to comment