Commissioner Ranganath about Hydra : జీవో 99 ద్వారా జులై 19న హైడ్రా ఏర్పాటు చేశారని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైడ్రా చట్టబద్ధతపై ప్రశ్నిస్తున్నారని ఇది చట్టబద్ధమైనదే అని తెలిపారు. కార్యనిర్వాహక తీర్మానం ద్వారానే హైడ్రాను ఏర్పాటు చేశారన్నారు. దీనికి చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ లోపు ఆర్డినెన్స్ రానుందని తెలియజేశారు. హైడ్రాకు విశేష అధికారాలు కూడా రాబోతున్నాయని అన్నారు. 6 వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లు వస్తుందని గ్రేహౌండ్స్, టాస్క్‌ఫోర్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుందని సూచించారు.
Be the first to comment