Skip to playerSkip to main content
  • 8 years ago
Sensational news going viral regarding Ram Charan and sukumar' s Rangasthalam movie. Senior NTR role confirmed in Ranasthalam

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న రంగస్థలం చిత్రంపై రోజు రోజుకు అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ చిత్రానికి ఉన్న అనేక ప్రత్యేకతల వలన సినీవర్గాలు, అభిమానులు మొత్తం ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. రాంచరణ్ ఈ చిత్రంలో ఛాలెంజింగ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రం గురించి తాజగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వార్త చిత్రంపై అమాంతం అంచనాలు పెంచే విధంగా ఉంది. ఈ చిత్రంలో 1985 నాటి రాజకీయాల ప్రస్తావన ఉంటుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయాలకు సంబందించిన సన్నివేశాలలో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రస్తావన ఉంటుందనేది లేటెస్ట్ న్యూస్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రంలో సవాల్ తో కూడుకున్న పాత్రని పోషిస్తున్నాడు. దర్శకుడు సుకుమార్ చరణ్ ని వినికిడి లోపం ఉన్న యువకుడిగా చూపించనున్నాడు. టీజర్ లో సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబుగా చరణ్ అందరిని అలరించిన సంగతి తెలిసిందే.
రంగస్థలం చిత్రం కేవలం పల్లెటూరి కథ మాత్రమే కాదు. ఈ చిత్రంలో 1985 నాటి రాజకీయ పరిస్థితులని చూపించబోతున్నట్లు తెలుస్తోంది.1985 నాటి మండల స్థాయి రాజకీయ పరిస్థితులని సుకుమార్ కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నాడట.
ఈ చిత్ర రాజకీయ సన్నివేశాలలో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ ప్రస్తావన ఉంటుందని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైనతే రామ్ చరణ్ సినిమాకు అందరూ క్యూ కట్టడం ఖాయం.
Be the first to comment
Add your comment

Recommended