Skip to playerSkip to main content
  • 8 years ago
Rangasthalam will be coming out first on 30th March opening the summer season. This summer, Ram Charan Tej, Allu Arjun and Mahesh Babu are releasing their movies.

2018 కొత్త సంవత్సరం మొదలై ఒకటిన్నర నెల గడుస్తున్నా టాలీవుడ్ పరిస్థితి మాత్రం మారడం లేదు. ఇప్పటికే అదే తరహా లీస్ట్ సక్సెస్ రేట్ తో నిర్మాతలు బండి లాగిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో ఇద్దరు బడా హీరోల చిత్రాలతో సందడి మొదలైంది. కానీ అజ్ఞాతవాసి చిత్రం మాత్రం అంచనాలని అందుకోలేదు. బాలయ్య జై సింహా చిత్రం మాత్రం నిర్మాతకు లాభాల పంట పండించింది.
ఇటీవల విడుదలైన తొలిప్రేమ చిత్రం మాత్రం ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో స్పష్టంగా తన హవా కొనసాగిస్తోంది. మళ్ళీ మార్చి నెలాఖరు వరకు బాక్స్ ఆఫీస్ ఖాళీగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
సంక్రాంతి సీజన్ ముగిసాక బాక్స్ ఆఫీస్ వద్ద సందడి బాగా తగ్గింది. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన భాగమతి చిత్రం రాణించింది. ఆ తరువాత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ టచ్ చేసి చూడు చిత్రంతో నిరాశ పరిచాడు.
విష్ణు ఆచారి అమెరికా యాత్రతో, నిఖిల్ కిర్రాక్ పార్టీ చిత్రంతో రెడీగా ఉన్నారు. కానీ ఈ చిత్రాల విడుదల విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. త్వరలో విడుదల కావలసి ఉన్న ఓ మోస్తరు అంచనాలు ఉన్న చిత్రాలు ఇవే. ఆచారి అమెరికా యాత్ర చితా పూర్తి వినోదాత్మక చిత్రంగా, కిర్రాక్ పార్టీ యువతని ఆకట్టుకునే చిత్రాలుగా రాబోతున్నాయి.
సాధారణంగా మార్చి నెలలో చిత్రాలని విడుదల చేయడానికి నిర్మాతలు అంతగా ఆసక్తి చూపించారు. ఎంతుకంటే సినిమాలని ఆదరించే యువత మొత్తం పరీక్షల హడావిడిలో ఉంటారు కనుక. ఈ సారి కూడా మార్చి నెల వెలవెల బోనుంది. ఒకటి రెండు చిన్న చిత్రాలు మిహానా మార్చిలో మరే సినిమా విడుదలకు సిద్ధంగా లేదు.
యువత పరీక్షల హడావిడి ముగిసాకా వేసవిలో పేలే తొలి బాంబు రంగస్థలం. మార్చి నెలాఖరున అంటే 30 వ తేదీన చరణ్ తన చిత్రంతో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మండు వేసవి ఏప్రిల్ లో అల్లుఅర్జున్, మహేష్ వంటి బడా హీరోలు బాక్స్ ఆఫిస్ పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

Be the first to comment
Add your comment

Recommended