No buyers for superstar Rajinikanth's Kaala Movie which never happened before. Kaala movie is produced by his son-in-law Dhanush and scheduled for a launch on 27 April. 2 big movies of Allu Arjun and Mahesh Babu will also be releasing at the same time due to which buyers are not coming forward
రజనీకాంత్ హీరోగా 'కబాలి' ఫేం పా రంజిత్ దర్శకత్వంలో 'కాలా' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాధారణంగా అయితే రజనీకాంత్ సినిమాకు తెలుగులో భారీ డిమాండ్ ఉంటుంది. అయితే 'కాలా' విషయంలో మాత్రం అలా లేదట. ఏప్రిల్‌లో 27న 'కాలా' చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే నిర్మాతలు ఆశించిన రేటుకు ఈ చిత్రాన్ని కొనేందుకు తెలుగు బయ్యర్లు ముందుకు రావడం లేదట. శంకర్ దర్శకత్వంలో రాబోతున్న రజనీకాంత్ మూవీ ‘2.0' రూ. 90 కోట్లకు ఏషియన్స్ ఫిల్మ్ వారు కొనుగోలు చేశారు. అయితే ‘కాలా' చిత్రాన్ని రూ. 30 కోట్లకు కూడా ఎవరూ కొనడానికి సాహసించడం లేదని తెలుస్తోంది. రజనీకాంత్, పా రంజిత్ కాంబినేషన్లో వచ్చిన గత చిత్రం ‘కబాలి' తెలుగునాట దారుణమైన ప్లాప్ అయింది. తెలుగులో ఈచిత్రాన్ని కొన్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. మళ్లీ అదే కాంబినేషన్లో వస్తున్న చిత్రంపై భారీగా కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కాలా' చిత్రాన్ని మంచి ధరకు అమ్మడానికి నేరుగా ఈ చిత్ర నిర్మాత, రజనీకాంత్ అల్లుడు, తమిళ హీరో ధనుష్ రంగంలోకి దిగారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, డిస్ట్రిబ్యూటర్ చదలవాడ సోదరులను కలసి చర్చలు జరిపినట్లు సమాచారం. కాలా' సినిమా విడుదల సమయంలోనే తెలుగులో రెండు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘భరత్ అను నేను', అల్లు అర్జున్ చిత్రం ‘నా పేరు సూర్య' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాలను బాక్సాఫీసు వద్ద తట్టుకుని మూడో సినిమా నిలబడటం చాలా కష్టం. అందుకే బయ్యర్లు ఎవరూ ముందుకు రావడం లేదు.
Be the first to comment