Mega Hero's clashes, Allu Arjun takes lead
  • 6 years ago
Two mega hero's are coming at same time with their movies. One is Sai Dharam Tej's intelligent and another one is Varun Tej Toliprema, in both Toliprema movie created a positive buzz in audience. meanwhile Stylish Star Allu Arjun may conduct a meeting with mega hero's to talk about box office clashes, especially about Sai Dharan Tej and Varun Tej.

టాలీవుడ్‌లో ఇదేదో మెగా సంవత్సరం లాగే కనిపిస్తోంది. సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీ నుంచి ముందుగా వెండితెరపై సందడి చేయబోతున్నారు. ఆ తర్వాత చెర్రీ, బన్నీ 'రంగస్థలం', 'నా పేరు సూర్య'లతో రాబోతున్నారు. ఈ ఒక్క నెలలోనే మెగా ఫ్యామిలీ నుంచి వెంట వెంటనే రెండు సినిమాలు రాబోతున్నాయి. దీంతో ఈ మెగా కాంపిటీషన్‌పై అటు మెగా కుటుంబంలోనూ.. ఇటు అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. సాయిధరమ్ తేజ్ 'ఇంటిలిజెంట్', వరుణ్ తేజ్ 'తొలిప్రేమ' సినిమాల కోసం మెగా కుటుంబం బాగానే చొరవ తీసుకుంటోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయ్యేందుకు తమవంతు ప్రమోషన్ బాగానే చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాంచరణ్ సైతం సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు.
అయితే ఇండస్ట్రీలో మాకు మేమే పోటీ అన్నట్టుగా ఉండే మెగా ఫ్యామిలీ.. మెగా వారసుల మధ్య ఫైట్ చూసి కాస్త కలవరపడుతోంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఇద్దరు యువ మెగా హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి సిద్దమవడం అభిమానుల్లోకి ప్రతికూల సంకేతాలు తీసుకెళ్తాయని భావిస్తోంది. ఫైట్ ఉంటే వేరే హీరోలతో ఉండాలే తప్ప.. మెగా హీరోల మధ్య క్లాషెస్ ఉండవద్దని ఆ కుటుంబం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో బన్నీ చొరవ తీసుకుని త్వరలోనే ఓ మీటింగ్ పెట్టబోతున్నాడని ప్రచారం జరుగుతోంది..
మెగా హీరోలు తమలో తామే పోటీ పడితే.. భవిష్యత్తులో ఒకరితో మరొకరికి విభేదాలు తలెత్తే అవకాశం ఉందని మెగా ఫ్యామిలీ భావిస్తోందట. పైగా మెగా అభిమానుల సపోర్ట్ కూడా హీరోల మధ్య చీలిపోయే అవకాశముందని, అలా జరిగితే ఆయా హీరోల మార్కెట్ దెబ్బతింటుందనే ఆలోచనలో పడ్డారట. ఈ పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టడానికే బన్నీ లీడ్ తీసుకుని ముందుకొచ్చినట్లు చెబుతున్నారు.
Recommended