Allu Sirish Cooking in Allu Arjun B-Dubs Bar Kitchen
తండ్రి నుంచి వ్యాపార రంగంలో ఎన్నో మెలకువలు నేర్చుకున్న బన్నీ మొదట రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించాడు . "800 జూబ్లీ" పేరుతో ఇప్పటికే తన ఆధ్వర్యంలో ఓ పబ్‌ను నడుపుతున్నాడు ఈ స్టైలిష్ స్టార్. ఆ తర్వాత 'కానోలీ కేఫ్' అంటూ ఓ స్విస్ బేకరీ కూడా మొదలుపెట్టాడు. తాజాగా వరల్డ్ ఫేమస్ స్పోర్ట్స్ బార్ బఫెల్లో వైల్డ్ వింగ్స్ బి-డబ్స్కి ఫ్రాంచైజీని స్టార్ట్ చేశాడు అల్లు అర్జున్. ఇక ఇండియాలో ఈ సంస్థకు ఇదే తొలి ఫ్రాంఛైజీ అట.హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో బన్నీ..ఈ ‘బి-డబ్స్'ను ఏర్పాటు చేశాడు. అలాగే స్పోర్ట్స్ టీమ్ లు కొనుగోలు కూడా చేస్తున్నాడు. మెగా ఫ్యామిలీలో మిగతా వారితో పోలిస్తే అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు. సినిమాకు సంబంధించిన విశేషాలే కాదు... పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటాడు. తాజాగా ఓ వంట చేస్తూ శిరీష్ పోస్ట్ చేసిన ఫొటో అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ వంట కంటే అది చేసిన ప్లేసే ఎక్కువగా అట్రాక్ట్ చేస్తోంది. అల్లు అర్జున్ కూడా తాజాగా తాజాగా స్టార్ట్ చేసిన బార్ కి శిరీష్ వచ్చాడు. వచ్చాక తీరిగ్గా కిచెన్ రూంలోకి ఎంటరయ్యి వంటలో తనకున్న ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. చికెన్ వింగ్స్ తయారు చేసి ఇదిగో ఇలా సిద్ధమైందంటూ ఆహార ప్రియుల నోరూరేలా ఓ ఫొటో తీశాడు. దీనిని ట్విట్టర్ లో అభిమానులందరికీ షేర్ చేశాడు. గ్రేట్ ఫుడ్ అంటూ తన వంటకు కితాబు ఇచ్చేసుకుని ఆహార ప్రియులైతే ఈ బార్ ను విజిట్ చేయమంటూ ఓ సలహా కూడా ఇచ్చాడు.
Be the first to comment