Thalapathy Vijay‘s Mersal is easily one of the highest grossers of 2017. Apart from its phenomenal performances at the Tamil Nadu box office, Mersal has been creating waves overseas. వివాదాస్పద చిత్రంగా మారిన మెర్సల్ స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా కలెక్షన్లపరంగా దుమ్ము రేపుతున్నది. విజయ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా మెర్సల్ ఓ రికార్డు క్రియేట్ చేసింది. తమిళనాడు బాక్సాఫీస్‌నే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌ను కుదిపేస్తున్నది. గత 12 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. గత 12 రోజుల కలెక్షన్లను పరిశీలిస్తే కేవలం ఓవర్సీస్ మార్కెట్‌లోనే రూ.72 కోట్లు వసూలు చేసింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఫ్రాన్స్, మలేషియాలో రికార్డు కలెక్షన్లను సాధించడం సినీ వర్గాల్లో ఆశ్చర్య రేపుతున్నది. ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో లీ గ్రెనేడ్ రెక్స్ అనే థియేటర్‌లో మెర్సల్ రిలీజ్ అయింది. ఈ సినిమా హాల్ కెపాసిటీ 2000 సీట్లు. ఇప్పటికీ మెర్సల్ ఈ థియేటర్‌లో 100% ఆక్యుపెన్సీతో దూసుకెళ్తున్నది. ఫ్రాన్స్‌లో 10కే క్లబ్ చేరిన విజయ్ మూడో చిత్రంగా ఘనతను సాధించింది.
Be the first to comment