Telugu Text to Speech Engine

  • 13 years ago
కంప్యూటర్ మీద అక్షరాలను తెలుగులో చదివి విన్పించే స్పీచ్ ఇంజిన్ ఇదిగోండి..

మన కంప్యూటర్ స్ర్కీన్ మీద ఉన్న అక్షరాలను తెలుగులో చదివి విన్పించడానికి Indian Language TTSలో భాగంగా ఓ స్పీచ్ ఇంజిన్ ని iit వారు అభివృద్ధిపరిచారు. దాన్ని మీరూ డౌన్ లోడ్ చేసుకుని వాడవచ్చు. అదెలాగో ఈ వీడియోలో చూపించాను.

ఆ TTS ఇంజిన్ డివిడిలు ఈరోజే నాకు iit నుండి చేరాయి. వాస్తవానికి వారం రోజుల క్రితమే ఇంటర్నెట్ లో ఇది అందుబాటులోకి వచ్చినా పనుల వత్తిడి వల్ల ఇంత అద్భుతమైన సదుపాయాన్ని మీకు పరిచయం చేయలేకపోయాను. నేరుగా డివిడిలు iit వారి నుండి వచ్చిన తర్వాతా దీన్ని మీకు పరిచయం చేయకపోవడం భావ్యం కాదనిపించింది. అందుకే ఇప్పటికీ మేగజైన్ ప్రిపరేషన్ లో తలమునకలై ఉన్నా ఈ వీడియోని తయారు చేశాను.

టెక్నాలజీ సామాన్య ప్రజలకు చేరవేయడానికి కృషిచేస్తున్న iitలకూ, ప్రభుత్వ విభాగాలకూ, సంస్థలకూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

- నల్లమోతు శ్రీధర్

ఈ వీడియోలో తెలుగు సమాచారాన్ని ఎలా చదివి విన్పిస్తోందో మీరే చూడొచ్చు.

Recommended