Skip to playerSkip to main content
  • 8 years ago
విజయ్ హీరోగా నటించిన తమిళ చిత్రం 'మెర్సల్' తెలుగులో 'అదిరింది' పేరుతో నిన్న(అక్టోబర్ 27)న విడుదల కావాల్సి ఉండగా విడుదల కాలేదు. ఆన్ లైన్లో టికెట్లు కొన్న వారికి డబ్బులు కూడా వాపస్ ఇచ్చేశారు. అయితే సినిమా సెన్సార్ వివాదం వల్లే విడుదల కాలేదనే వాదన ఉంది. అయితే అందులో నిజం లేదు అంటున్నారు కేంద్ర సెన్సార్ బోర్డ్ చీఫ్ ప్రసూన్ జోషి. మెర్సల్ తెలుగు వెర్షన్ 'ఆదిరింది' మూవీకి తాము ఇప్పటికే సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చామని, ఒక్క కట్ కూడా చేయలేదన్నారు.
తెలుగులో ఈ చిత్రాన్ని శరత్ మరార్ విడుదల చేయడానికి రైట్స్ తీసుకున్నారు. అయితే సినిమా రిలీజ్ చివరి నిమిషంలో ఎందుకు ఆగిందనే విషయంపై ఆయన ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు.
‘మెర్సల్' సినిమా తమిళనాడులో దీపావళికి విడుదలైంది. అయితే ఇందులో జీఎస్టీ‌ని ఉద్దేశించి డైలాగులు ప్రధానమంత్రి మోడీ నిర్ణయాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టే విధంగా ఉన్నాయంటూ బీజేపీ నేతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో ఆ డైలాగులు తొలగించాలని కొంత మంది కోర్టుకు వెళ్లారు కూడా.
తెలుగు వెర్షన్లో వివాదాస్పద డైలాగులు మ్యూట్ చేసి మరీ సెన్సార్‌కు పంపారు నిర్మాతలు. దీంతో ఎలాంటి కట్స్ లేకుండానే తెలుగు సెన్సార్ క్లియర్ అయిపోయింది.
Tamil blockbuster "Mersal" will release in Telugu without any cuts at the insistence of the censor board, said the body's top boss, Prasoon Joshi.
Be the first to comment
Add your comment

Recommended