Skip to playerSkip to main content
  • 8 years ago
What Dachepalli Subbaiah said in his last phone call..
#Dachepalli

సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు సుబ్బయ్య చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అత్యాచారం అనంతరం అతను పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లుగా ఓ ఫోన్ కాల్‌ను బట్టి తెలుస్తోంది.
గురువారం నాడు సుబ్బయ్య ఓ బంధువుతో ఫోన్ మాట్లాడాడు. ఫోన్ కాల్‌లో సుబ్బయ్య పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఇది అనుకోకుండా జరిగిందని, నాకు చావడం ఒక్కటే మార్గమని, నేను చేయకూడని పనిని చేశానని వాపోయినట్లుగా ఉంది. ఎవరికి ముఖం చూపించలేను, అందుకే చావడానికి వెళ్తున్నాని చెప్పాడు.
నాకు చావు ఒక్కటే మార్గమని చెప్పాడు. నేను చావడానికే వెళ్తున్నానని చెప్పాడు. నేను చేసిన పని కారణంగా నా కొడుకు పరువు పోతోందన్నాడు. పదిమందికి మంచి మాటలు చెప్పి బతికినవాడిని అని, అనుకోకుండా జరిగిందన్నాడు. సుబ్బయ్య ఎప్పుడు ఉరేసుకున్నాడో వైద్యులు నిర్ణయిస్తారు సుబ్బయ్య ఎప్పుడు ఉరేసుకున్నాడో వైద్యులు నిర్ణయిస్తారని పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని కలెక్టర్ శశిధర్ తెలిపారు.

Category

🗞
News
Comments

Recommended