Skip to playerSkip to main content
  • 28 minutes ago
World Travel Market 2026 : లండన్‌లో ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రదర్శన వరల్డ్ ట్రావెల్ మార్కెట్- 2026 కార్యక్రమం జరిగింది. ఇన్‌క్రెడిబుల్ ఇండియా బృందంలో భాగంగా ఆంధ్ర రాష్ట్ర పర్యాటక విశేషాలను ఈ వేదికపై ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో యూరప్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి జయకుమార్ గుంటుపల్లి, ఏపీఎన్ఆర్టీ కోఆర్డినేటర్లు వినోద్ మాదాల, పవిత్ర గుడిపాటి, రత్న శ్రీఉప్పల పాల్గొన్నారు. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఏపీ పర్యాటక శాఖ స్టాల్‌ను సందర్శించారు. ఏపీ పర్యాటక విశేషాలను, ప్రదర్శనలో ఏర్పాటు చేసిన అంశాలను ఆయన పరిశీలించి అభినందించారు. ఏపీలోని ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ఆకర్షణలను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ ప్రదర్శనలో రాష్ట్ర పర్యాటక శాఖ పాల్గొంది. ఈ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ పర్యాటక సంస్థలు, ప్రతినిధులు, పర్యాటక రంగ ప్రముఖులకు రాష్ట్రంలోని సందర్శనీయ ప్రాంతాలను పరిచయం చేసే అవకాశం లభించింది. ఆధ్యాత్మిక పర్యాటకం, ప్రకృతి పర్యాటకం, వారసత్వ పర్యాటకానికి ఉన్న ప్రత్యేకతలను ప్రపంచానికి తెలియజేయడంపై దృష్టి పెట్టారు.

Category

🗞
News
Transcript
00:27Thank you so much for watching.

Recommended