Skip to playerSkip to main content
  • 8 hours ago
Upasana Visits Srikalahasti Temple : ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన ఆధ్యాత్మిక పర్యటన చేశారు. ఆమె తిరుపతి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఉపాసనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక మర్యాదలతో ఆమెను ఆలయంలోకి సాదరంగా ఆహ్వానించారు. శ్రీకాళహస్తి ఆలయం రాహు కేతు పూజలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో ఉపాసన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాహు కేతు సర్పదోష నివారణ పూజల్లో ఆమె పాల్గొన్నారు. ఈ విశేష పూజల అనంతరం ఆమె గర్భగుడిలోకి వెళ్లారు. అక్కడ కొలువైన శ్రీ వాయు లింగేశ్వర స్వామిని ఆమె దర్శించుకున్నారు. అలాగే అమ్మవారు శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని కూడా దర్శించుకుని తన మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం ఆలయ ఆలయ ఆవరణలో వేద పండితులు ఉపాసనకు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆమెకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. 

Category

🗞
News
Transcript
00:26Thank you for listening.

Recommended