Skip to playerSkip to main content
  • 23 hours ago
Mummidivaram Durga Devi in ​​Shakambhari Alankaram : కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజైన విజయదశమి (దసరా) పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ముగింపు వేడుకల సందర్భంగా స్థానిక పలు ఆలయాల్లో అమ్మవారు భక్తులకు శాకాంబరీ దేవిగా దర్శనం ఇచ్చారు. కూరగాయలతో లోకాలను పోషించే చల్లని తల్లిగా ప్రసిద్ధి చెందిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో వేచి ఉన్నారు. అమ్మవారిని పలు రకాల కూరగాయలతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు భారీ లడ్డూని ప్రసాదంగా సమర్పించారు. పలు ఆలయాల్లో కుంకుమపూజ నిర్వహించారు. ముమ్మిడివరంలోని ఆలయాలు అమ్మవారి నామస్మరణతో మార్మోగాయి. ఈ పవిత్ర దినాన అమ్మవారి ఆశీస్సులు ఉంటే జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. నేటితో విజయదశమి సంబరాలు ముగియనుండటంతో, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయ కమిటీలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాయి.

Category

🗞
News
Transcript
00:26Thank you for listening.

Recommended