CM Revanth Grandson Reyansh Playing Football : శనివారం ఉప్పల్ స్టేడియంలో మెస్సి బృందానికి ఏమాత్రం తగ్గకుండా సందడి చేశారు సీఎం రేవంత్ రెడ్డి, మనవడు రియాన్ష్. తాత కంటే ముందే తెలుపు, ఎరుపు జెర్సీతో మైదానంలో రియాన్ష్ అడుగుపెట్టాడు. రేవంత్, మెస్సిలతో కలిసి ఫుట్‌బాల్ ఆడాడు. మనవడిని సీఎం దగ్గరకు తీసుకుని ఫుట్‌బాల్‌ను ఎలా కిక్ కొట్టాలో చూపించారు. రియాన్ష్తో మెస్సి కొద్దిసేపు ఆడాడు. అతనితో ఫొటో దిగాడు. ఈ దృశ్యం స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొని స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను హోరెత్తించారు. గ్రేట్ ఇండియా టూర్లో భాగంగా మెస్సి మూడు రోజులు ఇండియా పర్యటనకు వచ్చారు. శనివారం కోల్‌కతా, హైదరాబాద్‌లో పర్యటించారు. కోల్‌కతాలో గందరగోళ వాతావరణం తలెత్తగా, హైదరాబాద్‌లో మాత్రం ప్రేక్షకులు మెస్సిని హత్తుకున్నారు. స్టేడియం మొత్తం మెస్సి మెస్సి నినాదాలతో హోరెత్తిపోయింది. ఈక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మనవడు రియాన్ష్ మెస్సితో కలిసిన దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
Be the first to comment