Skip to playerSkip to main content
  • 4 days ago
CM Revanth Reddy Visits SLBC Tunnel Live  : నాగర్​ కర్నూల్​ జిల్లా మన్నేవారిపల్లిలో సీఎం రేవంత్​రెడ్డి పర్యటిస్తున్నారు. హెలీ మాగ్నటిక్​ సర్వేకు సిద్ధంగా ఉన్న సర్వే హెలికాప్టర్​ను ముఖ్యమంత్రి పరిశీలించారు. అధునాతన పరికరాలను సైతం సీఎం పరిశీలించారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్​కుమార్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఉన్నారు. ఎస్​ఎల్​బీసీ సొరంగం తవ్వకం పనుల పునరుద్ధరణలో భాగంగా నేటి నుంచి సర్వే చేయనున్నారు. ఎన్​జీఆర్​ఐ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో మాగ్నటిక్​ జియోఫిజికల్​ సర్వే నిర్వహించనున్నారు. హెలికాప్టర్​కు అమర్చిన స్పెషల్​ ట్రాన్స్​మీటర్​ ద్వారా సర్వే అనేది జరగనుంది. భూమిలో వెయ్యి మీటర్లలోతు వరకు జియో లాజికల్​ డేటాను సేకరించనుంది. హైటెక్​ సర్వే పద్ధతితో భూమి లోపల షీర్​జోన్​లు, నీటి ప్రవాహాలను ఈ సర్వేలో గుర్తించనున్నారు. సొరంగం తవ్వాల్సిన మిగిలిన 9.8 కిలోమీటర్ల మార్గంలో ఈ సర్వే చేపట్టనున్నారు. ఫిబ్రవరి 22న.. సొరంగం పనులు జరుగుతున్న సమయంలో పైకప్పు కూలడంతో ఎనిమిది మంది చిక్కుకుపోగా టన్నెల్ బోరింగ్ యంత్రం పూర్తిగా ధ్వంసం అయింది. ఇద్దరి మృతదేహాల్ని మాత్రమే బయటకు తీశారు. అప్పట్నుంచి SLBC సొరంగం పనులు నిలిచిపోయాయి. Conclusion:

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended