Bollywood actress Vidya Balan visited Tirumala temple : తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నేడు (శనివారం) పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రెండో వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విద్యాబాలన్‌కు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన విద్యాబాలన్ స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమల దర్శించుకున్న సినీ నటి దివి : సినీ నటి, బిగ్‌బాస్ ఫేమ్ దివి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో దివి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు దివికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Be the first to comment