మతిస్థిమితం లేని బావ పేరు మీద జేసీబీని బావమరిది కొనుగోలు చేశాడు. అలాగే బావ పేరు మీద పోస్టల్ బీమా కూడా చేసాడు. బావను హత్య చేస్తే బీమా డబ్బులు వస్తాయని, జేసీబీ తీసుకున్న రుణం కూడా మాఫీ అవుతుందని పన్నాగం పన్ని సొంత బావనే, స్నేహితుడితో కలిసి హత్య చేసాడు. ఆ తర్వాత సాధారణ మృతి కింద నమ్మించే యత్నం చేసాడు. పోలీసులు అనుమానం వచ్చి లోతుగా విచారించడంతో అసలు బండారం బట్టబయలైంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో జరిగింది.