Minister Nimmala Ramanaidu Teleconference : సాగు నీటి సంఘాల ఆధ్వర్యంలో పనులను మే నెలాఖరుకు పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. గతంలో మాదిరిగా కాకుండా మే చివరి నాటికి, అన్ని అత్యవసర పనులు, నాణ్యత తో పూర్తి చేయాలని తేల్చిచెప్పారు. ఇరిగేషన్ అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇరిగేషన్ పనులు, నిర్వహణ , మరమ్మతుల కోసం రూ. 344 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అవసరమైన చోట్ల 7 రోజుల వ్యవధితో షార్ట్ టెండర్లను పిలవడానికి ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు.
Comments