Union Minister Hardeep Singh Puri in Vijayawada: నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 90 వేల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయబోతోందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హరిదీప్‌సింగ్‌పూరి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు, ఆయా ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందుతాయని అన్నారు. రాష్ట్రానికి చెందిన చాలా మంది ప్రజాప్రతినిధులు బీపీసీఎల్ ప్రాజెక్టును తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం రాయామపట్నం వద్ద ఆరు వేల ఎకరాల స్థలాన్ని కేటాయించిందని చెప్పారు.
Be the first to comment