Minister Anam Ramanarayana Reddy Comments On YS Jagan : జగన్ చేసిన అప్పులు తీర్చడం సంగతి దేవుడెరుగు, కూటమి ప్రభుత్వం మరో 20ఏళ్లు పాలన చేసినా వడ్డీలు తీరవని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో చేసిన అప్పులను, ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలన్నా, చట్ట సభలన్నా గౌరవం లేని వ్యక్తి జగన్ అని విమర్శించారు.
Be the first to comment