MLC Beeda Fires on Anil Kumar : వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపైనా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ఆయన మాట్లాడటాన్ని ఖండించారు. కాకాణి వరదాపురం రుస్తుం మైన్స్‌లో క్వార్ట్జ్ అక్రమ మైనింగ్, రవాణా, అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగించడంతో పాటు నిల్వ ఉంచారనే ఫిర్యాదుతోనే పోలీసులు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారని తెలిపారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Be the first to comment