MLC Kavitha On Caste Census : బీసీలకు సంపూర్ణ న్యాయం చేయాలన్న డిమాండ్‌పై భవిష్యత్తులో గల్లీ నుంచి దిల్లీ వరకు పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యంగంలో చట్ట సవరణలు చేయాలని సూచించారు. హైదరాబాద్ సంక్షేమ భవన్‌లో బీసీ సంఘాలు, యునైటెడ్ ఫులే ఫ్రండ్, తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి కుల గణన కమిషన్ బూసాని వెంకటేశ్వరరావును ఆమె కలిశారు.