KCR Comments on Operation kagar : కేంద్రప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరుమీద ఛత్తీస్గఢ్లో యువకులను, గిరిజనులను ఊచకోచ కోస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. దానిని వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. చర్చలకు పిలవాలని నక్సలైట్లు కోరుతున్నారన్న ఆయన వాళ్ల విజ్ఞప్తి మేరకు చర్చలని ఆహ్వానించాలన్నారు. బలగాలు ఉన్నాయని అందరినీ చంపుకుంటూ పోతే ప్రజస్వామ్యం అనిపించుకోదని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. ఆపరేషన్ కగార్ ఆపాలని తీర్మానం చేసి దిల్లీకి పంపుదామని కార్యకర్తల నుద్దేశించి ఆయన ప్రసంగించారు.
Be the first to comment