Damage Crops in joint Anantapur District : అకాల వర్షాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. పిడుగు పాట్లతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈదురుగాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి వచ్చిన పంట వర్షార్పణం కావడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
Be the first to comment