People Suffering Due to Damaged Roads in Kakinada District : మైదాన ప్రాంతం నుంచి మన్యంలోని ఊళ్లను కలిపే కీలక రహదారి అది. నిత్యం వేల వాహనాలు ఈ రోడ్డుపై రద్దీగా రాకపోకలు సాగిస్తాయి. అలాంటి దారిలో భారీ గుంతలు, రాళ్లు తేలిన పరిస్థితులు ప్రయాణాన్ని నరకప్రాయంగా మార్చాయి. పాము మెలికలుగా సాగే ప్రయాణంలో రెప్ప వాలిస్తే ఇక అంతే. వాహనం బోర్లా పడాల్సిందే. వాహనదారులకు అగ్ని పరీక్ష పెడుతున్న ఈ రహదారికి గత వైఎస్సార్సీపీ పాలనలో కనీస మరమ్మతులు చేయలేదు. దీంతో వైఎస్సార్సీపీ పాలనా పాపం ప్రయాణికులకు నిత్యం శాపంగా మారింది.
Be the first to comment