Heavy Rains in Andhra Pradesh: వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో చాలా చోట్ల గండ్లు పడ్డాయి. వేల హెక్టార్లలో వరి నారు మళ్లు నీటమునిగాయి. రహదారులపైకి వరద చేరి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. గోదావరికి వరద పోటుతో యంత్రాంగం అప్రమత్తమైంది. మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.
Be the first to comment