YSRCP Government Neglected Irrigation Canals: పంటలు పండాలంటే పొలంలోకి నీరు పారుదల కావాలి. కానీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాగునీటి కాలువలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లాలోని కనిగిరి రిజర్వాయర్ పరిధిలో కాలువలు సరిగా లేక రైతులు పంటలకు నీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. సోమశిల, కనిగిరి జలాశయాలు ఉన్నప్పటికీ వాటి పరిధిలోని కాలువల నిర్వహణను గత ప్రభుత్వం గాలికొదిలేదని రైతులు వ్యక్తం చేస్తున్నారు.
Be the first to comment