AP Deputy Chief Minister Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ చిన్నకుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడి అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకుంటున్న విషయం తెలిసిందే. శనివారం (ఏప్రిల్ 12) రాత్రి పవన్ తన సతీమణి అన్నాలెజినోవా, కుమారుడు మార్క్‌శంకర్, కుమార్తె పొలెనా అంజనా పవనోవాతో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. తన కుమారుడిని పవన్ ఎత్తుకుని ఎయిర్‌పోర్ట్‌లోని ఎస్కలేటర్ నుంచి బయటకు వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Be the first to comment