Skip to playerSkip to main content
  • 8 years ago
Andhra Pradesh minister Kollu Ravindra made statement on Poonam Kaur issue.

సినీ నటి పూనమ్ కౌర్‌ ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ప్రకటన చేశారు. చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా పూనమ్ కౌర్‌ను ఎలా నియమించారని సినీ క్రిటిక్ మహేష్ కత్తి ప్రశ్నిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను చిక్కుల్లో పడేయడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆ పరిణామాల నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ప్రకటన చేశారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ అభిమానులు కత్తి మహేష్ వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు. పరిస్థితిని సర్దుబాటు చేయడానికి అవసరమైన చర్యలు ప్రారంభమైనట్లు కనిపిస్తోంది.
తాను చేనేత శాఖ మంత్రిగా ఉన్న కాలంలో చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరినీ నియమించలేదని కొల్లు రవీంద్ర చెప్పారు. ప్రభుత్వపరంగా అలాంటి నియామకమే జరగలేదని ఆయన అన్నారు. ప్రభుత్వ పరంగా అంబాసిడర్‌ను నియమించాలనే చర్చనే జరగలేదని, కొంతమంది చేనేత సంఘ సభ్యులు పవన్‌ కల్యాణ్‌ను అంబాసిడర్‌గా ఉండాలని చెప్పి ఆయనను కలిసి కోరారని వివరిచారు. అంతకు మించి చేనేత వస్త్రాలకు సంబంధించి ఎవరినీ బ్రాండ్ అంబాసిడార్‌గా నియమించలేదని మంత్రి చెప్పారు.
ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `జ‌ల్సా` సినిమాలో క‌మలినీ పాత్ర కోసం తొలుత పూన‌మ్ కౌర్‌ను తీసుకున్నారని, ఆ సినిమా ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా జ‌రిగిన పూజ‌ల్లోనే ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్‌తో క‌లిసి పూన‌మ్ పాల్గొందని, అయితే ఆ త‌ర్వాత ప‌వ‌న్ సరసన పూన‌మ్ సెట్ కాదని భావించి దర్శకుడు క‌మ‌లినీని తీసుకున్నాడని పవన్ కల్యాణ్ అభిమాులు వివరించారు. తద్వారా పూజలపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ అభిమానులు సమాధానం చెప్పారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended