Hydraa Demolitions In Rajendranagar : రెండు కాలనీల మధ్య ఉన్న అడ్డుగోడ వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికుల నుంచి ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఆ గోడను కూల్చివేశారు. దీంతో హైడ్రా అధికారులకు స్థానికులు ధన్యవాదాలు తెలియజేశారు.
వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్ నియోజకవర్గ బండ్లగూడ జాగీర్ నగర పాలక సంస్థ పరిధిలోని శ్రీనివాస ఎంప్లాయిస్ కాలనీ, ఫోర్ట్యూన్ మెడోస్ కాలనీకి మధ్య గతంలో ప్రహరీ గోడను నిర్మించారు. పక్కపక్కనే ఉన్న కాలనీలోకి వెళ్లాలంటే 3 కిలోమీటర్ల మేర దూరం పోయి తిరిగి పోవాల్సి వస్తుండటంతో కాలనీ వాసులు ఈ విషయాన్ని హైడ్రా దృష్టికి తీసుకువెళ్లారు. అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు.
Be the first to comment