Yuva Story on Sri Padmavati Mahila University Students in Tirupati: మహిళా విద్యాలయం ఫార్మసీ విద్యార్థినులు అరుదైన ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. తమ పరిశోధనల్లో ఇప్పటి వరకూ ఆరోగ్య విభాగాల్లో చికిత్సకు అవసరమయ్యే స్థాయిలో మరింత మెరుగైన వైద్య చికిత్సలను అందించడానికి వీలుగా వివిధ రోగాలకు సంబంధించి వారు చేసిన పరిశోధనల్లో తయారైన ఉత్పత్తులకు సంబంధించి ఇప్పటికే ప్రాచుర్యం పొందుతున్నాయి. పరిశోధనా ఉత్పత్తులకు సంబంధించి విద్యార్థినులు పేటెంట్‌ను కూడా సాధించారు. అసలు ఈ ఫార్మసీ రంగంలో వారు ఏ విధమైన పరిశోధనలు చేశారు? ఆ పరిశోధనల ద్వారా వచ్చిన ఉత్పత్తులు మానవాళికి ఏ విధంగా ఉపయోగపడతాయి? ఎలాంటి రోగాలపై వారి పరిశోధనలు ప్రధానంగా సాగాయి? వారు చేసిన ఉత్పత్తులతో మానవాళికి ఏ విధమైన ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత తరుణంలో మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి వివిధ వ్యాధులు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వీటితో బాధపడుతున్న బాధితులకు ఉపశమనం కలిగించేలా శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ విద్యార్థినులు పరిశోధనలు చేస్తున్నారు. శరీరాలపై గాయాలను నయం చేయడానికి టిష్యూలను తయారు చేశారు. బయోసిరమిక్, బయోమెటీరియల్‌తో పాటు ఔషధ మొక్కల నుంచి తీసిన రసాలతో ఉత్పత్తులను రూపొందిస్తున్నారు. ప్రీ క్లినికల్ ట్రైల్‌లో భాగంగా జంతువులపై ప్రయోగించి ఉత్తమ ఫలితాలను సాధించారు. పరిశోధన తీరు వాటి ఉపయోగాలను శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ విద్యార్థినులు వివరించారు.
Be the first to comment