BRS MLA Padi Kaushik Reddy Arrest : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం బంజారాహిల్స్ పీఎస్‌లో విధులకు ఆటంకం కలిగించారంటూ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు 20 మందిపై కేసు నమోదు చేశారు. దీంతో గురువారం ఉదయం కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు చేరుకుని ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి పీఎస్‌కు తరలించారు.
Be the first to comment