BRS MLA Vivekananda Goud Press Meet : హైదరాబాద్ ప్రతిష్ఠ రోజురోజుకూ పడిపోతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చి వ్యాపారం చేస్తారని, స్థిరాస్తి రంగం పడిపోయి వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. పాలన బాగుందని కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని, క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈ మేరకు మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.