Farmers Protesting Against Pharma Village : వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఫార్మా విలేజ్ ఏర్పాటును నిరసిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన మహాపాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర బయలుదేరిన నేతలను వికారాబాద్ జిల్లా బొమ్రాస్ పేట మండలం తుంకిమెట్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని పరిగి తరలించారు.
హకీంపేట రేణుకా ఎల్లమ్మతల్లి దేవాలయం నుంచి హకీంపేట్, ఆర్.బి తాండ, లగచర్ల మీదుగా దుద్యాల్ ఎమ్మార్వో కార్యాలయం వరకూ పాదయాత్ర కొనసాగాల్సి ఉండగా బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున హకీంపేటకు చేరుకున్నారు. నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ హకీంపేటకు చేరుకుని పాదయాత్రకు అనుమతి లేదని ఆందోళన కారులకు తెలిపారు.
Be the first to comment