దామరచర్ల మండలంలో ఓ పొలంలో అచ్చుగుద్దినట్టుగా అసలు నోట్లను పోలిన నకిలీ కరెన్సీ నోట్ల కట్టలు పడేసి ఉన్నాయి. నార్కట్‌పల్లి-అద్దంకి రాష్ట్ర రహదారి వెంబడి బొత్తలపాలెం వద్ద ఉన్న ఓ రైతు పొలంలో సుమారు 40 వరకు రూ.500 నోట్ల కట్టలు పేర్చి ఉన్న సంచి పడి ఉండటాన్ని స్థానిక రైతులు సోమవారం ఉదయం గుర్తించారు. కొన్నింటిని తీసుకెళ్లారు. విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో మిర్యాలగూడ గ్రామీణ సీఐ వీరబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Be the first to comment