Uddandapur Land Dwellers Protest : వారంతా సాగునీటి ప్రాజెక్టుల కోసం సర్వస్వం త్యాగం చేశారు. భూములు, ఇళ్లు, పొలాలు వదులుకున్నారు. ప్రాజెక్టు పనులు చకాచకా అయ్యాయిగానీ, నిర్వాసితులకు పరిహారం, పునరావాసం అరకొరగానే అందాయి. వాగ్దానాలు చేసిన ప్రజాప్రతినిధులు, హామీలిచ్చిన అధికారులు మారారు గానీ, నిర్వాసితుల తలరాతలు మారలేదు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ప్రాజెక్టు పనులు ముందుకు సాగనివ్వమని ఉద్దండపూర్ జలాశయ నిర్వాసితులు స్పష్టం చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు పాలమూరు పర్యటనకు వస్తున్న మంత్రులను మా మొర ఆలకించండంటూ వేడుకుంటున్నారు.
Be the first to comment