Deputy CM Bhatti Vikramarka On Musi Development : అందరి ఆమోదయోగ్యంతోనే చెరువుల పునరుద్ధరణ, మూసీ ప్రక్షాళన చేస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 2014-23 కాలంలోనూ జలవనరులు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. దీనిని సరిచేసే పనిని చేపట్టిన కాంగ్రెస్ సర్కార్‌పై రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు బురదచల్లడం సరికాదని సూచించారు. నిర్వాసితులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనన్న భట్టి, విపక్షాలు ఏ సలహాలు ఇచ్చినా స్వీకరించేందుకు సిద్ధమని తెలిపారు.
Comments