CM Chandrababu Naidu on YS Jagan Mohan Reddy: తాను 1995 సీఎంనే కానీ 2014 సీఎంను కాదని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, చంద్రబాబు స్పష్టం చేశారు. ఈసారి ఖచ్చితంగా రాజకీయ పరిపాలనే చేస్తానని ఆయన అన్నారు. విశ్వసనీయతను నిలబెట్టుకుంటూ రాజకీయ ముసుగులో తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి అయ్యాక పార్టీ వ్యవహారాలు పట్టించుకోవట్లేదని క్యాడర్ నుంచి వస్తున్న విమర్శలు అర్ధం చేసుకోగలనని అన్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళగిరిలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
Be the first to comment