CM Chandrababu met PM Modi: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నిధులను సత్వరం అందించాలని ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దిల్లీ పర్యటనలో రెండో రోజూ కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నడ్డాలతో సమావేశమైన చంద్రబాబు పోలవరం, అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగేందుకు సాయం అందించాలని కోరారు. విశాఖ ఉక్కు భవిష్యత్తుపై కుమారస్వామితో సమాలోచన జరిపారు.