CM Revanth On Illegal Encroachments in Hyderabad : కొందరు పెద్దలు ప్రాజెక్టుల వద్ద ఫాంహౌస్‌లు కట్టుకున్నారని, ఫాంహౌస్‌ల నుంచి వచ్చే డ్రైనేజీని గండిపేటలో కలుపుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆక్రమణలను వదిలి గౌరవంగా తప్పుకోవాలని సూచించారు. ఆక్రమణలను కూల్చే బాధ్యత తాను తీసుకుంటానని, కూల్చివేతలపై స్టే తెచ్చుకున్నా కోర్టుల్లో కొట్లాడుతామని స్పష్టం చేశారు.