Skip to playerSkip to main contentSkip to footer
  • 2/9/2025
CM Revanth Reddy On Telangana Development : ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదం వెనక ఒకే వ్యక్తి ఓకే పార్టీ అనే ప్రధాని మోదీ రహస్య ఏజెండా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కేరళలో మాతృభూమి అనే దినపత్రిక తిరువనంతపురంలో నిర్వహించిన మాతృభూమి ఇంటర్‌నేషనల్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ లెటర్స్‌ సదస్సుకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏడాదిలో సుపరిపాలన ఎంత మార్పు తెస్తుందో చెప్పెందుకు తెలంగాణ ప్రభుత్వం నిదర్శనమని తెలిపారు. ప్రపంచ స్థాయి నగరాలైన న్యూయార్క్‌, లండన్‌, దుబాయ్‌లతో పోటీ పడేలా హైదరాబాద్‌ను అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టినట్లు వివరించారు. విద్యా, నైపుణ్యాలే తమ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యమన్న ముఖ్యమంత్రి తగ్గట్టుగానే స్కిల్ యూనివర్సిటీ దిశగా అడుగులేస్తున్నామని తెలిపారు.

Category

🗞
News

Recommended