Minister Uttam Kumar On Rythu Runa Mafi : సాంకేతిక కారణాలతో కొందరికి రుణమాఫీ జరగలేదని, వారికి సైతం నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తామని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వారి మాయలో పడొద్దని రైతులకు సూచించారు. ఆధార్, రేషన్‌కార్డు వివరాలు సరిగా లేని దాదాపు ఐదు లక్షల మంది అన్నదాతల సమాచారంపై స్పష్టత వచ్చాక వారికి కూడా రుణమాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు.
Be the first to comment